REEL VILLAIN TO REAL HERO
❤ సోను సూద్ ❤
సోను సూద్ రెండు మూడేళ్ల క్రితం ఒక మంచి సినిమా యాక్టర్ గా, సినిమాలో ఒక గొప్ప గా నటించే విలన్ గా మనకు పరిచయం. కానీ ఇప్పుడు 2020 లో కరోనాతో మన దేశం గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు అవతరించిన కలియుగ కర్ణుడు గా , దేవుడు పంపించిన మనిషిగా మనందరికీ తెలుసు. ఎక్కడ ఆపద ఉందని తనకు తెలిసిన వెంటనే సహాయం చేయడానికి దేవుడిలా ప్రత్యక్షమవుతాడు. ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి మనం తెలుసు కోవాలి. ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి మన భావితరాల వారికి తెలియజేయాలి.
జననం: 30 జూలై 1973,
జన్మస్థలం: MOGA, పంజాబ్.
తల్లిదండ్రులు: శక్తి సాగర్ సూద్ , సరోజ సూద్
భార్య పిల్లలు : సోనాలి , ఇద్దరు కొడుకులు అయాన్ మరియు ఇషాంత్ .
చదువు: SCHOOL : SACRED HEART SCHOOL, MOGA,PUNJAB.
COLLEGE : YESHWANTRAO CHAVAN COLLEGRE OF ENGINEERING, NAGAPUR.
ఇంజనీరింగ్ TO సినిమా :
సోను సూద్ ఎగువ మధ్యతరగతి చెందినవాడు . సోను సూద్ తండ్రి కి షోరూం ఉంది. తల్లి ఒక టీచర్. సోను సూద్ కు అమితాబచ్చన్ అంటే చాలా ఇష్టం. కానీ ఎప్పుడు సినిమాలో నటించాలి అని అనుకోలేదు. సోను సూద్ కాలేజీ చదువుకునే రోజుల్లో తన మిత్రుల లో ఒకరు ఇలా అన్నాడు. ఎంత చదువుకున్నా, ఎంత సంపాదించిన సినిమా యాక్టర్స్ కు ఉండే క్రేజ్ , పేరు ప్రఖ్యాతులు మనకు రావు అని అన్నాడు. అది విన్న సోను సూద్ ఎలాగైనా, ఎంత కష్టమైనా సరే సినిమా యాక్టర్ అయ్యి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్తే ఏదైనా చదువు పూర్తయిన తర్వాత చేసుకోమని వాళ్లు వార్నింగ్ ఇచ్చారు. ఒకవైపు చదువుకుంటూనే నటనలో మెలుకువలు నేర్చుకుంటూ చదువు పూర్తి చేశాడు. చదువు పూర్తయిన తరువాత కొంతకాలం తండ్రి షో రూమ్ లో పని చేశాడు. అక్కడ ఉండే వారికి తన నటనా యొక్క ప్రతిభను చూపించేవాడు వారందరూ సోను సూద్ ని నువ్వు గొప్ప యాక్టర్ అవుతావని ప్రోత్సహించారు. కొన్ని రోజుల తర్వాత యాక్టర్ అవ్వాలని కోటి ఆశలతో ముంబై చేరుకున్నాడు.
5500 తో ప్రయాణం:
సోను సూద్ ఐదు వేల ఐదు వందల తో ముంబై చేరుకున్నాడు. ముంబైలో ఆరుగురు ఉంటున్న రూములో ఉండేవాడు. అలా రూమ్ లో ఉండి అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉండేవాడు. కానీ అవకాశాలు అంతా సులభంగా దొరకలేదు. తాను తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. దీంతో సోను సూద్ ఒక ప్రైవేట్ సంస్థలో 4500 జీతంకు ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది.
BORIVAL TO CHURCHGATE :
సోనూ సూద్ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నప్పుడు. తన రూం నుండి అక్కడకు చాలా దూరం ఉండటం వలన నెలకు 420 రూపాయలు తో BORIVAL నుండి CHURCHGATE వరకు ట్రైన్ పాస్ తీసుకున్నాడు. అలా ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ ఖాళీ దొరికినప్పుడు సినీ ఆఫీసుల లకు ఫొటోస్ పట్టుకొని తిరిగేవాడు. తన నటనను మెరుగుపరుచుకోవాలని కొని ఒక నెల రోజుల పాటు నటన లో శిక్షణ తీసుకున్నాడు.
500 remuneration తో మొదలు :
1997 గ్రాసిమ్ మిస్టర్ ఇండియా కాంటెస్ట్ జరుగుతుందని తెలుసుకొని అందులో పాల్గొని ఆ కాంటెస్ట్ లో టాప్ 5 లో నిలిచాడు. తర్వాత కొన్ని మోడలింగ్ సంస్థలు సోను సూద్ కు అవకాశం ఇచ్చాయి. చిన్న చిన్న లోకల్ బ్రాండ్స్ కు సోను ను పెట్టి యాడ్స్ తీసేవి, కొన్ని పెద్ద యాడ్స్ లో జూనియర్ మోడల్ గా ఆకాశం ఇచ్చేవారు. సోను సూద్ మొదటి సారిగా 500 తన నటనకు రెమ్యూనరేషన్ అందుకొన్నాడు. 500 పట్టుకొని సోను సూద్ చాలా సంతోషించాడు.
మలుపుతిప్పిన చెన్నయ్ అవకాశం:
1998 లో లోకల్ బ్రాండ్స్ మోడలింగ్ కోసం చెన్నై వెళ్లారు. ఆ సమయంలో విజయ్ కాంత్ నటించిన KALLAZGAR సినిమాలో టెర్రరిస్టు పాత్ర కోసం చాలా మందిని చూసారు గాని ఎవరు సూట్ అవ్వలేదు. అయితే ఆ సినిమా డైరెక్టర్ సోను సోను సూద్ ను ఒక యాడ్ లో చూసి పిలిపించి చూశారు. ఆ పాత్ర కోసం సోను సూద్ కరెక్ట్ గా సూట్ అయ్యారు. ఇలా సోను సూద్ తను తమిళ సినిమాలో మొదట అవకాశం దక్కించుకున్నారు. ఈ సినిమా వల్ల సోనుసూద్ మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత తమిళ హీరో విజయ్ నటించిన సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా కూడా 1999 జూన్ 25న విడుదల అయింది. ఆ తర్వాత హ్యాండ్సప్ అనే తెలుగు సినిమాలో అవకాశం వచ్చింది. సినిమాలు చేస్తున్న కానీ సోనూసూద్ కు బాలీవుడ్లో నటించాలనే కోరిక ఉండేది. ఆ సమయంలో మలయాళ దర్శకుడు సుకుమార్ నాయర్ భగత్ సింగ్ మీద సినిమా వింటున్నప్పుడు భగత్సింగ్ పాత్రకు సోనీ సూద్ ని ఎంచుకున్నారు. సోను సూద్ ఈ సినిమా మలయాళం అనుకున్నాడు కానీ హిందీ లో తీస్తున్నామని చెప్పగానే చాలా ఆనందించాడు. అలా హిందీ ,తమిళం ,తెలుగు మొత్తం 7 భాషల్లో నటిస్తూ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.
అరుంధతిలో పసుపతి :
సోను సూద్ నటుడిగా ఆల్ ఇండియా మొత్తంనటుడిగా మంచి పేరు తీసుకొచ్చిన సినిమా అరుంధతి . ఈ సినిమాలో సోను సూద్ తన నట విశ్వరూపం చూపించాడు. ఈ సినిమా కోసం స్వర్గీయ కోడి రామకృష్ణ చంద్రముఖి సినిమా చూసి సోను సూద్ ఈ పాత్ర కోసం ఎంపిక చేశాడు. ఈ సినిమాతో సోను సూద్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం.
పాకిస్తాన్ మూవీ: సోను సూద్ ఇష్క్ పాజిటివ్ అనే పాకిస్తానీ మూవీ లో కూడా నటించాడు.
జాకీ చాన్ తో స్నేహం:
జాకీ చాన్ తో కలిసి కుంపు యోగా అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రం చేస్తున్నప్పుడు జాకీ చాన్ తో సోను సూద్ కి మంచి స్నేహం ఏర్పడింది. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. జాకీచాన్ ఎప్పుడు ఇండియా వచ్చిన సోను సూద్ ను కలుస్తారు.
REEL VILAN TO REAL HERO :
ఇలా తన నటనతో మనల్ని అలరించిన సోను సూద్ 2020 లాక్డౌన్ దేశం గడ్డు పరిస్టిస్తులలో ఉన్న సమయంలో తన లో ఆపద సమయం లో ఆదుకునే దేవుడిని పరిచయం చేసాడు. మాకు ఆపద అని సోషల్ మీడియా లో ఎవరు తనకు తెలియజేసిన, నేను ఉన్నాను అని ఆదుకుంటున్నాడు. ప్రభుత్వాలు ,పెద్ద పెద్ద రాజకీయ నాయకులూ , సంస్థలు, స్టార్స్ చెయ్య లేనివి సోను ఒక్కడే చేస్తున్నాడు. ఈ విధం గా REAL HERO అనిపించుచుకున్నాడు.
వలస కూలీలతో మొదలు :
గత యాడాది లొక్డౌన్ సమయంలో వలస కూలీలు పడుతున్న కష్టాలు చూసి చెలించి పోయాడు.ఒక సోను ఇంట్లో TV చూస్తుండగా వలస కూలీలు వందల కిలోమీటర్లు నడవడం చూసి చలించిపోయి , దేశంలో ప్రజలు ఇన్ని కష్టాలు పడుతున్నపుడు నేను ఇంట్లో కూర్చొని ENJOY చెయ్యడం ఏంటి, అని తన భార్యతో చెప్పి వాళ్లకు ఎదో ఒకటి చెయ్యాలి, సహాయం చెయ్యాలి ,అని వలస కూలీలు వద్దకు వచ్చి దయచేసి నా మాట వినండి , నేను మీకు బస్సు లు ఏర్పాటు చేస్తా అని చెప్పి, తన సొంత రెస్టౌరెంట్లో ఉండటానికి ఏర్పాటు చేసాడు. అలా ఆరోజు నుండి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి కొన్ని వందల బస్సులు లలో కొన్ని వేల మందిని తమ సొంత ఊళ్లకు పంపించాడు.
ప్రత్యేక విమానం లో :
ట్రాక్టర్ బహుమతి :
కిరికిస్తాన్ నుండి విద్యార్థులను రప్పించాడు :
బామ్మకు ప్రేమతో :
సోను సూద్ ఫౌండేషన్ :
021 లో COVID సెకౌండ్ వేవ్ లో సోను ఈ ఫౌండేషన్ పేరు మీద ఉచితంగా చాల రాష్ట్రాలలో ఆక్సిజన్ ప్లాంట్లు తెరిచి ఉచితంగా ఆక్సిజన్ అందించాడు.
సోను సూద్ గుడి ( టెంపుల్ ):
తెలంగాణలో Dubba tanda గ్రామానికి చెందిన ప్రజలు సోను సూద్ గారికి ఏకంగా సరాసరి 2 లక్షలు విలువ చేసే గుడిని నిర్మించారు. అంటే అర్థం చేసుకోండి సోనుసూద్ ప్రజలు ఎంతగా సాయి పడ్డాడో. ప్రజలు తనని దేవుడిలా చూస్తున్నారు.
0 కామెంట్‌లు